భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.. దుమ్మురేపుతున్న చెన్నైసూపర్ కింగ్స్
ఐపీఎల్ బ్రాండ్ విలువ దూసుకెళ్తోంది. ఈ మేరకు ఒక్క ఏడాదికే దాదాపుగా 80 శాతం మేర అధిక వ్యాల్యూ పలుకుతోంది. హౌలిహాన్ నివేదిక ప్రకారం గత సంవత్సరం బ్రాండ్ విలువ 1.8 బిలియన్లు ఉంది. అయితే ప్రస్తుత ఏడాదికే 3.2 బిలియన్లకు ఎగబాకింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ బ్రాండ్ విలువ సుమారు 26,438 కోట్లకు పడగలెత్తింది. ఐపీఎల్ 2023 సీజన్ ఛాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్ మోస్ట్ బ్రాండ్ వాల్యూ టీమ్ గా నిలిచింది. మరోవైపు బిజినెస్ ఎంటర్ ప్రైజ్ వాల్యూ ర్యాంక్సింగ్స్ లోనూ ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానంలో ఇంత వరకూ ఒక్క టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఉండటం గమనార్హం.
ధోనీ కెప్టెన్సీ, జడేజా సూపర్ ఇన్నింగ్స్ సీఎస్‌కే జట్టుకు ప్లస్
వివిధ ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువ ఆధారంగా ర్యాంకింగ్స్ : 1. సీఎస్‌కే బ్రాండ్ విలువ - 212 మిలియన్ డాలర్లు 2. ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ - 195 మిలియన్ డాలర్లు. 3. ముంబై ఇండియన్స్ - 190 మిలియన్ డాలర్లు 4. కేకేఆర్ - 181 మిలియన్ డాలర్లు 5. డీసీ - 133 మిలియన్ డాలర్లు 6. సన్ రైజర్స్ హైదరాబాద్ - 128 మిలియన్ డాలర్లు 7. ఆర్ఆర్ - 120 మిలియన్ డాలర్లు 8. గుజరాత్ టైటాన్స్ - 120 మిలియన్ డాలర్లు 9. పంజాబ్ కింగ్స్ - 90 మిలియన్ డాలర్లు 10.లక్నో సూపర్ జెయింట్స్ - 83 మిలియన్ డాలర్లుగా నిలిచాయి.