ఎంఎస్ ధోనీ స్టామినా అంటే ఇది.. మిస్టర్ కూల్ బర్తడేకి అకాశమంత కటౌట్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై అతని అభిమానులు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోనీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఈ సారి మిస్టర్ కూల్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసిన అతని మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. ధోనీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లో 52 అడుగుల కటౌట్ పెడతే.. తామేమి తక్కువ కాదంటూ కృష్ణా జిల్లా నందిగామలో ఏకంగా 77 అడుగుల కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని కటౌట్‌లో ధోనీ టీమిండియా జెర్సీలో ఉండగా, నందిగామ కటౌట్‌లో మాత్రం చైన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో కనిపించాడు.
ధోనీ బర్త్‌డే సందర్భంగా 'ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' మూవీ రీ-రిలీజ్
ఈ భారీ కటౌట్లతో అభిమానులు ధోనీ 42వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఎంఎస్ ధోనీ బర్త్‌డే సందర్భంగా 'ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ' మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం సినిమా హీరోలకు మాత్రమే పరిమితమైన ఈ కటౌట్లు ఇప్పుడు ధోనీలాంటి క్రికెటర్‌కు కూడా అలాంటి గౌరవ లభించడం అభినందిచగ్గ విషయం. ధోనీ ఇండియా తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 4876 రన్స్, వన్డేల్లో 10773 రన్స్, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.