
MS Dhoni: ఐపీఎల్ అన్‌క్యాప్డ్ రూల్ మేడ్ ఫర్ ఓన్లీ MS ధోనీ: భారత మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని ఐపీఎల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik)స్వాగతించాడు.
ఈ నిబంధన ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కోసం రూపొందించారని ఆయన పేర్కొన్నాడు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం,ఏ భారత క్రికెటర్ ఐపీఎల్ సీజన్‌కి ముందు ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో(టెస్టులు, వన్డేలు, టీ20లు)తుది జట్టులో ఆడకపోతే, లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోతే,అతడిని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు.
ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనిని తిరిగి రిటైన్ చేసుకునే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి.
కానీ ధోనీ లేదా సీఎస్కే ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
ఈ ఆటగాడు మైదానంలో అడుగుపెడితే రేటింగ్స్
''ప్రతి ఒక్కరూ ఈ నిబంధన గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక వ్యక్తి (ధోనీ) కోసం రూపొందించబడింది. నేను దానికోసమే ఎదురుచూశాను.ఐపీఎల్‌లో ఈ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ అన్ని జట్లకూ లబ్ధి చేకూర్చుతూ,తానూ ప్రయోజనం పొందుతోంది.ఈ లీగ్‌ను 15-18 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తూ,ఆటగాళ్లను సంతోషంగా ఉంచుతోంది. ఎవరైనా టీవీ బ్రాడ్‌కాస్టర్‌ను అడిగినా, ఈ ఆటగాడు మైదానంలో అడుగుపెడితే రేటింగ్స్ పెరుగుతాయని చెబుతారు.ఇది వాస్తవం.లీగ్‌కు ప్రయోజనం చేకూర్చే చర్యలను ఎందుకు చేయకూడదు? మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే. అన్‌క్యాప్‌డ్ నిబంధన గురించి అన్ని జట్లకు సమాచారం ఇచ్చారు. ఫ్రాంఛైజీలు అంగీకరిస్తే ఇది అమలవుతుంది. జట్లు దీనికి వ్యతిరేకం కానే కావు. ఆయన ఒక ప్రత్యేక ఆటగాడు''అని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
నవంబరులో ఐపీఎల్ వేలం జరిగే అవకాశం
ఈసారి ఐపీఎల్ పాలకవర్గం ఫ్రాంఛైజీలకు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కూడా ఉంటుంది. రిటైన్ చేసే ఐదుగురు ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, మొత్తం జట్టు వ్యయం రూ.120 కోట్ల వరకు ఉంటుంది.
ఫ్రాంఛైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు, నవంబరులో ఐపీఎల్ వేలం జరిగే అవకాశం ఉంది.