Page Loader
IPL: ఐపీఎల్​లో తొలి బంతిని వేసిన బౌలర్, ఆ బాల్​ను షాట్ కొట్టిన క్రికెటర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్​లో తొలి బంతిని వేసిన బౌలర్, ఆ బాల్​ను షాట్ కొట్టిన క్రికెటర్ ఎవరో తెలుసా?

IPL: ఐపీఎల్​లో తొలి బంతిని వేసిన బౌలర్, ఆ బాల్​ను షాట్ కొట్టిన క్రికెటర్ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ ప్రత్యేకమైనది. ఈ లీగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో దేశవిదేశాల్లో ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులు విపరీతమైన ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్,ఇప్పటివరకు 17 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ లీగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.అందుకే, ఐపీఎల్ శాటిలైట్ హక్కులు వంటి వాటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ లీగ్, తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక మంచి వేదికగా మారింది.ఐపీఎల్‌లో ప్రతిభ కనబరిచే ఆటగాళ్లకు,టీమిండియా వంటి జట్లలో చోటు దక్కుతుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మొదటి బాల్ వేసిన బౌలర్ ఎవరు, ఫస్ట్ బాల్ ఆడిన బ్యాటర్ ఎవరు వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వివరాలు 

ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ 

2008 ఏప్రిల్ 18న ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. మొదట కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. మొదటి బంతిని ఆర్‌సీబీ బౌలర్ ప్రవీణ్ కుమార్ వేయగా, కేకేఆర్ బ్యాటర్ సౌరబ్ గంగూలీ ఆడాడు. ప్రవీణ్ కుమార్ వేసిన లెంగ్త్ బాల్‌ను గంగూలీ డిఫెన్స్ చేస్తూ బాటింగ్ ప్రారంభించాడు. ఈ విధంగా, ఐపీఎల్‌లో తొలి బాల్ వేసిన బౌలర్‌గా ప్రవీణ్ కుమార్,బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా సౌరభ్ గంగూలీ గుర్తింపు పొందారు. ఈ మ్యాచ్‌లో సౌరభ్ గంగూలీ 12 బంతుల్లో కేవలం 10 పరుగులే చేసి వెనుదిరిగాడు.

వివరాలు 

ఐపీఎల్ చరిత్రలో తొలి విజయం 

ఐపీఎల్ తొలి సీజన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు చరిత్రాత్మక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అద్భుత ప్రదర్శన ఇస్తూ, కేవలం 73 బంతుల్లో 158 పరుగులు చేశాడు.ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 223 పరుగుల లక్ష్యంతో ఆర్‌సీబీ ఆడటానికి దిగగా, కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. దీంతో కేకేఆర్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐపీఎల్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది.