ఎట్టకేలకు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన మూడో టీ20ల్లో ఎట్టకేలకు ఐర్లాండ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్లు తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. వరుసగా మూడో టీ20ని గెలిచి సిరీస్‌ని క్లీస్ స్వీప్ చేసుకోవాలనుకున్న బంగ్లా ఆశలకు ఐరీష్ జట్టు కళ్లెం వేసింది. దీంతో 2-0 తో బంగ్లా టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐర్లాండ్ తరుపున పాల్ స్టిర్లింగ్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 124 పరుగులకే కుప్పకూలంది. పవర్‌ప్లేలో బంగ్లాదేశ్ 41/4 స్కోరు చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన షమీమ్ అర్ధ సెంచరీతో జట్టును అదుకున్నాడు. అతను 15 టీ20ల్లో 205 పరుగులు చేశాడు.
14 ఏళ్ల తర్వాత బంగ్లాపై విజయం సాధించిన ఐర్లాండ్
మిగతా బంగ్లా బ్యాటర్లు విఫలం చెందారు. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ (3/25)తో విజృంభించాడు. మాథ్యూ హంఫ్రీస్ రెండు, హాండ్, హ్యారీ టెక్టర్, వైట్, డెలానీ తలా వికెట్ సాధించారు. లక్ష్య చేధనకు దిగిన ఐర్లాండ్ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 41 బంతుల్లో 71 పరుగులు చేసిన బంగ్లా కెప్టెన్ షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. బంగ్లాదేశ్‌పై 14 ఏళ్ల తర్వాత ఇదే తొలి టీ20 మ్యాచ్ ను ఐర్లాండ్ గెలిచింది. బంగ్లాదేశ్‌పై చివరగా 2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.