Page Loader
Karun Nair: లార్డ్స్ టెస్ట్‌ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?
లార్డ్స్ టెస్ట్‌ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?

Karun Nair: లార్డ్స్ టెస్ట్‌ తర్వాత కరుణ్‌పై వేటు ఖాయమా? నాల్గో టెస్టులో చోటు దక్కదా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

లార్డ్స్ వేదికగా కీలక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టు, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 2-1తో వెనుకబడింది. ఇప్పుడు మిగిలిన రెండు టెస్ట్‌లూ భారత్‌కు 'మస్ట్ విన్' మ్యాచ్‌లే. జులై 27న మాంచెస్టర్‌లో మొదలవనున్న నాలుగో టెస్ట్‌లో గెలవాల్సిందేనన్న ఒత్తిడిలో జట్టు ఉంది. ఈ నేపథ్యంలో వరుస విఫలాలతో నిరాశపరిచిన కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Details

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఫలితం నిరాశ

తొలిసారి 2016లో ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి సంచలనమైన కరుణ్ నాయర్.. ఆ తర్వాత పేలవ ఫారంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మెరిసి తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ తన రీఎంట్రీలో మాత్రం నిరాశపరిచాడు. లీడ్స్ టెస్ట్ : తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ : 31, 26 పరుగులు లార్డ్స్ టెస్ట్ : 40, 14 పరుగులు మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 131 పరుగులు మాత్రమే చేసిన కరుణ్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఫామ్ లేని ఆటతీరు వల్ల భారత్ టాప్ ఆర్డర్ మరింత ఒత్తిడికి లోనవుతోంది.

Details

సాయి సుదర్శన్‌కి అవకాశం?

కరుణ్‌ను పక్కనపెట్టి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు నాలుగో టెస్ట్‌లో అవకాశమిస్తారని సమాచారం. అయితే ఏదైనా అద్భుతం జరిగి కరుణ్‌ నాయర్‌కు మరో అవకాశం లభించినా.. ఇకపై జట్టులో కొనసాగాలంటే భారీ ఇన్నింగ్స్ తప్పనిసరి. అభిమానుల నిరాశ ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని కరుణ్‌ నాయర్‌ అందిపుచ్చుకోలేకపోవడంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. కీలక సమయంలో బ్యాటింగ్‌లో నిలవలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక మాంచెస్టర్ టెస్ట్‌లో ఏం జరుగుతుందో చూడాలి. భారత్‌ను విజయ మార్గంలో నిలబెట్టడమే కాదు.. తన కెరీర్‌నే నిలబెట్టుకోవాలంటే కరుణ్ నాయర్‌కు ఇది చివరి అవకాశంగా మారే అవకాశముంది.