
BCCI: ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ అల్టిమేటం?.. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఐపీఎల్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడి నుండి వ్యక్తిగత కారణాలతో సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు.
విరామం తీసుకోవాలనే అతని నిర్ణయానికి BCCI మద్దతు ఇచ్చినప్పటికీ, టూర్ ముగిసిన తర్వాత నుంచి బీసీసీఐ, టీమ్ మేనెజ్‌మెంట్‌తో టచ్‌లో లేడు.
ఆ తరువాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్ అందుబాటులో లేడు.
జాతీయ జట్టులో పునరాగమనం కోసం ఇషాన్ కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీ 2024లో ఆడాల్సిందే అని భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
అయితే కిషన్ మాత్రం రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా.. బరోడాలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Details
జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడడం తప్పనిసరి
ఇషాన్ ప్రవర్తనపై సీరియస్ అయిన బీసీసీఐ ..సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్లేయర్లు ..జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడడం తప్పనిసరి చేసింది.
జాతీయ జట్టు సభ్యులకు, ఎన్‌సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉందని కూడా పేర్కొంది.
బీసీసీఐ చేసిన ప్రకటనతో ఇషాన్ ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు.
ఈ నెల 16 నుంచి రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడట.
అంతేకాకుండా, త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో కూడా అడాతాడట.
ఈ విషయాన్ని ఇషాన్ సన్నిహితులు మీడియాతో చెప్పినట్లు సమాచారం.