Loading...
Ishan Kishan: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో భారత తరఫున అరుదైన ఘనత

Ishan Kishan: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో భారత తరఫున అరుదైన ఘనత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. 2026లో ఇప్పటివరకు 173.2 స్ట్రైక్‌రేట్‌తో 892 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో అతడు 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1,164 పరుగులు చేశాడు.2025లో అభిషేక్ శర్మ 193.46 స్ట్రైక్‌రేట్‌తో 859 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి,సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. కోహ్లి 2022లో 781 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 2023లో 733పరుగులు సాధించాడు.

వివరాలు 

టీమిండియా ఘన విజయం

అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతడు 57 పరుగులు చేశాడు.

అభిషేక్ శర్మ 39 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చివర్లో తిలక్ వర్మ 15 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

వివరాలు 

అఫ్గాన్ 159 పరుగులు

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

ఆ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సాధించారు.

ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీ20ల్లో ఇషాన్ కిషన్ సంచలనం.. క్యాలెండర్ ఇయర్‌లో 892 పరుగులు

ADVERTISEMENT