Page Loader
ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం
ధోనిపై ప్రశంసలు కురిపించిన సునీల్ గావస్కర్

ఎంఎస్ ధోని లాంటి కెప్టెన్ భవిష్యతులో రావడం కష్టమే : టీమిండియా దిగ్గజం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్, తన కెప్టెన్సీలో ఎన్నో రికార్డులను సాధించాడు. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో ఎంఎస్ ధోని దిట్ట. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లోనూ అతను ఎంతో ప్రశాంతంగా కనపడుతూ మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లను అందించిన ధోని, ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు నాలుగు టైటిళ్లను అందించాడు. ఈ ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చైన్నై రెండింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో అత్యత్తుమ కెప్టెన్ ధోనినే అంటూ ఆకాశానికెత్తాడు.

ధోని

ధోని లాంటి కెప్టెన్ ఇప్పటివరకూ ఎవరూ లేరు

కష్టకాలంలో మ్యాచ్ ను గెలిపించడం ధోనికి బాగా తెలుసని, 200 ఐపీఎల్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించడం చాలా కష్టమని, ధోని లాంటి కెప్టెన్ ఇప్పటివరకూ ఎవరూ లేరని, భవిష్యత్‌లోనూ ఎవరూ ఉండరని సునీల్ గావస్కర్ స్పష్టం చేశారు. అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా గవాస్కర్ ప్రశంసించాడు. ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీకి ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభం ఇస్తున్నాడని, దీంతో ఆర్సీబీ ఎక్కువ పరుగులు చేస్తోందని కితాబిచ్చాడు. నేడు చిన్నస్వామి స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి.