Nandini Agasara : సొంత టీమ్ మేటే ట్రాన్స్ జెండర్ అనడం బాధాకరం.. AFI కి ఫిర్యాదు చేస్తానన్న నందిని
భారత్ అథ్లెట్ స్వప్న బర్మన్ తోటి క్రీడాకారిణి, తెలంగాణ అమ్మాయిపై నందిని అగసారాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నందిని అగసారా ఓ ట్రాన్స్ జెండర్ అని, ఆసియా గేమ్స్ లో ఆమె తనకు రావాల్సిన పతకాన్ని ఎగరేసుకుపోయిందని స్వప్న ఆరోపణలు చేసింది. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారా మండిపడింది. తానెంటో తనకు తెలుసునని, ఆమె దగ్గర రుజువులు ఉంటే చూపించాలని పేర్కొంది. బర్మన్ ఆరోపణలపై తాను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI)కు ఫిర్యాదు చేస్తానని, వాస్తవానికి పతకం గెలిచిన సందర్భాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని, అయితే తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భారత్ కు తిరిగి వెళ్తున్నానని అగసారా చెప్పారు.
నందినిపై స్వప్న బర్మన్ ఘాటు వ్యాఖ్యలు
సోమవారం జరిగిన మహిళల హెప్లాథ్లాస్ ఫైనల్‌లో తెలంగాణకు చెందిన హెప్టాథ్లెట్ నందిని అగసారా 5712 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో హెప్టాథ్లెట్ స్వప్న బర్మన్ 5708 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో బర్మన్ ఈ ఘాటు వ్యాఖ్యలను చేసింది. అయితే 2018 ఆసియా క్రీడల్లో స్వప్న బర్మన్ ఇదే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.