Page Loader
గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు
నేటి నుంచి గ్లోబల్ చెస్ లీగ్

గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మకంగా చేపట్టే చెస్ లీగ్‌కు సమయం అసన్నమైంది. టెక్ మహీంద్రతో కలిసి అంతర్జాతీయ చెస్ సమాఖ్య రూపకల్పన చేసిన గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్‌లో నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ప్రపంచంలోని అగ్రశేణి ఆటగాళ్ళు ఒకరిపై ఒకరు, వారి జట్ల కోసం కూడా బరిలోకి దిగనున్నారు. మొత్తంగా ఈ టోర్నీకి ఆరు జట్లను ఎంపిక చేశారు. జులై 2 వరకు ఈ లీగ్ కొనసాగనుంది. ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్, ప్రపంచ నంబర్ వన్ కార్లసన్, అయిదుసార్లు విశ్వ విజేత విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్ మాస్టర్లు కొనేరు హంపి, ద్రోణవల్లిహారిక ఈ టోర్నీలో పోటీ పడనున్నారు. ప్రతి జట్టులో ఆరుగురు క్రీడాకారులు ఉండగా.. ఇందులో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి.

Details

టాప్-2 నిలిస్తే ఫైనల్ కు చేరే అవకాశం

జీసీఎల్ స్కోరింగ్ విధానం కొంచెం భిన్నంగా ఉండనుంది. నల్లపావులతో గెలిచిన ఆటగాళ్లకు ఎక్కవ పాయింట్లు ఇస్తారు. తెల్లపావులతో గెలిచిన ప్లేయర్లకు మూడు పాయింట్లు అందనున్నాయి. డ్రా అయితే ప్లేయర్లకు చెరో జీపీ లభించనుంది. జీపీల్లో రెండు సమానంగా ఉంటే చెరొక ఎంపీ ఇవ్వనున్నారు. ప్రత్యర్థి జట్టు కన్నా తక్కువ జీపీలు సాధించిన జట్టుకు ఎంపీలు మాత్రం లభించవు. అయితే టాప్-2 నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్లో పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో బాలన్‌ అలస్కాన్‌ నైట్స్‌, చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌, గాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌, ఎస్జీ ఆల్ఫైన్‌ వారియర్స్‌, అప్‌గ్రేడ్‌ ముంబా మాస్టర్స్‌ జట్లు తలపడనున్నాయి.