కోహ్లీని దూషించిన పాక్ పేసర్ సోహైల్ ఖాన్..!
ఈ వార్తాకథనం ఏంటి
2015 ఫిబ్రవరిలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్- పాకిస్తాన్ తలపడింది. ఈ చిరకాల ప్రత్యర్థి పోరులో ఎప్పటిలాగే టీమిండియానే గెలుపొందింది. ఈ విజయంలో కింగ్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో పాక్ పేసర్ సొహైల్ ఖాన్ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కోహ్లీ అద్భుత సెంచరీతో దయాదులు చతికిలపడ్డాడు.
అయితే నాటి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, సోహైల్ ఖాన్ మధ్య జరిగిన వివాదం అప్పట్లో దూమారం రేపింది. తాజాగా ఈ ఘటనపై సోహైల్ ఖాన్ స్పందించారు.
విరాట్ కోహ్లీ
కోహ్లీపై మాజీ పాక్ బౌలర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
తాను బ్యాటింగ్‌కు దిగినప్పుడు విరాట్ కోహ్లీ తన దగ్గరికి వచ్చి కొత్తగా వచ్చావు.. ఎక్కువు మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు. బిడ్డా.. నువ్వు అండర్ 19 క్రికెట్ ఆడుతున్నప్పుడు తాను టెస్టు క్రికెటర్ అని చెప్పానని సోహల్ ఖాన్ వెల్లడించారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాకిస్తాన్ తరుపున సోహైల్ ఖాన్ తొమ్మిది టెస్టులు, 12 వన్డేలు, ఐదు టీ20లు ఆడారు. సోహైల్ చివరిసారిగా 2017లో పాకిస్థాన్ తరఫున ఆడాడు.