Page Loader
Jofra archer: లార్డ్స్‌ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆడించాలి.. జేమ్స్ అండర్సన్ సూచన 
లార్డ్స్‌ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆడించాలి.. జేమ్స్ అండర్సన్ సూచన

Jofra archer: లార్డ్స్‌ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆడించాలి.. జేమ్స్ అండర్సన్ సూచన 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జులై 10 నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్, టీమిండియా మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ తరఫున జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ పేసర్‌ జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు. 2021 ఫిబ్రవరి తర్వాత టెస్ట్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆర్చర్‌ తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మ్యాచ్ ఆడాడు. దీంతో పాటు భారత్‌తో రెండో టెస్ట్‌కు ప్రకటించిన ఇంగ్లాండ్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌కు తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 336 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైంది. సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-1తో సమం చేసింది.

వివరాలు 

ఆర్చర్ ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రెండన్ మెకల్లమ్‌ 

ఈ పరిస్థితుల్లో లార్డ్స్‌లో జరిగే కీలక మూడో టెస్ట్‌ మ్యాచ్‌కు జోఫ్రా ఆర్చర్‌ను తీసుకోవడం తప్పనిసరని అండర్సన్‌ సూచిస్తున్నాడు. "నా అభిప్రాయం ప్రకారం, జోఫ్రా మూడో టెస్ట్‌లో తప్పకుండా ఆడతాడు. ఇటీవలే అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ ఆడి, మళ్లీ బౌలింగ్‌కు తిరిగి వచ్చాడు. లార్డ్స్‌ వేదికగా ఆర్చర్‌ను తీసుకోకపోతే అది పెద్ద పొరపాటు అవుతుంది" అని అండర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ కూడా ఆర్చర్ ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం జోఫ్రా ఫిట్‌గా ఉన్నాడు. మూడో టెస్ట్‌కు ఎంపిక కోసం అతడిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అతడు టెస్ట్ క్రికెట్‌కు ఎంత ముఖ్యమో మేం బాగా తెలుసు" అని మెకల్లమ్‌ స్పష్టం చేశారు.