
Auqib Nabi: 47 ఏళ్ల కపిల్ రికార్డు బ్రేక్.. ఆకిబ్ నబీ'హ్యాట్రిక్ + 1'
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ బౌలర్ ఆకిబ్ నబీ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉండటం ప్రత్యేకత. ఈ ఘనత సాధించిన నబీ, దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన మూడవ బౌలర్ అయ్యాడు. మునుపు కపిల్ దేవ్ (1978),సాయిరాజ్ బహుతులే (వెస్ట్ జోన్, 2001) మాత్రమే ఈ ఘనతను సాధించారు. నార్త్ జోన్ తరఫున 47 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన కపిల్ రికార్డును ఆకిబ్ నబీ ఇప్పుడు తుడిచిపెట్టాడు. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ తన బౌలింగ్ ప్రదర్శన ద్వారా ఐదు వికెట్లు పడగొట్టాడు.
వివరాలు
నబీపై అర్ష్‌దీప్ ప్రశంసల వర్షం
కేవలం 10.1 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి, ఐదు వికెట్లు తీయడం అతని ప్రతిభను చూపిస్తుంది. నబీ బౌలింగ్ కారణంగా, ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 230 పరుగుల్లో కుప్పకూలింది. అంతకుముందు, నార్త్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసింది. ఓవైపు జట్టులో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా వంటి అంతర్జాతీయ బౌలర్లు ఉన్నా, ప్రత్యర్థిపై నబీ ప్రభావం చూపించడం గమనార్హం. నబీపై అర్ష్‌దీప్ ప్రశంసల వర్షం కురిపించాడు.
వివరాలు
నా లక్ష్యం అదే: నబీ
"మేము టీ బ్రేక్‌కు వెళ్లినప్పుడు మా కోచ్ ఒకటే చెప్పాడు. పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది,దూకుడుగా బౌలింగ్ చేయమని చెప్పాడు.మేము అదే చేశాం. ఇలాంటి ఘనత సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం అరుదుగా జరుగుతుంది. అంతకంటే, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం మరింత సంతోషాన్నిస్తుంది. బౌలర్‌గా ఇదే ముఖ్యమని చెప్పాలి. గత ఏడాది రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ,యశస్వి జైస్వాల్,శివమ్ దూబె,శార్దూల్ ఠాకూర్,శ్రేయస్ అయ్యర్‌లపై ఆడా, ఇందులో రోహిత్ మినహా మిగతావారిని ఔట్ చేశా. ఎప్పటికైనా నేను భారత జెర్సీ ధరించాలనేది నా కల. టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం కన్నా మరేదీ ముఖ్యం కాదు" అని నబీ వెల్లడించాడు.