IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌పై బుమ్రా రికార్డులివే
ఈ వార్తాకథనం ఏంటి
రేపటి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 7న మ్యాచ్ జరగనుంది. గువాహాటి బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2026లోని 13వ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. రాజస్థాన్ రాజల్స్ జట్టు ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ జట్టును కట్టడి చేయగల బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని అందరూ నమ్ముతున్నారు.
వివరాలు
బుమ్రా అంటే వణుకు..
2014 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పై విజృంభించాడు. ఈ రైట్-ఆర్మ్ సీమర్ 15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. యావరేజ్ 19.36 కాగా ఎకానమీ రేట్ 6.34గా ఉంది. ఇందులో ఒక ఫోర్ వికెట్ హాల్ (BBM: 4/20) కూడా ఉంది. 20 పరుగులకు 4 వికెట్లు తీసి బుమ్రా తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై వికెట్లు తీసిన వారిలో బుమ్రా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అమీట్ మిశ్రా 31 వికెట్లతో లీడ్‌లో ఉన్నారు.
వివరాలు
ఎకానమీ రేట్‌లో టాప్
ఈఎస్పీఎన్న ఇన్ఫో ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ పై 15 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా ఎకానమీ రేట్ 6.34గా ఉంది. ఇది తక్కువ ఎకానమీ రేట్. అయితే రషీద్ ఖాన్, చాహల్ వంటివారు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇక బుమ్రా గురించి చెప్పాలంటే.. ఆయన గురించి పరిచయం అవసరం లేదు. ఐపీఎల్‌లో అత్యుత్తమ పేసర్లులో ఒకరిగా బుమ్రాను లెక్కిస్తారు. ముంబై ఇండియన్స్ కోసం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా ఉన్నాడు. తన కెరీర్‌లో 183 వికెట్లు తీసి, యావరేజ్ 22.33తో అద్భుతమైన రికార్డులు నమోదు చేశారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కోసం బుమ్రా మాత్రమే ఐదు వికెట్లు తీసిన జాబితాలో ఉన్నాడు.