Page Loader
ICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా
రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా

ICC: రెండోసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్న జస్ప్రిత్ బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 14, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ 2024లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేన్ ప్యాటర్సన్‌లను ఓడించి ఈ గౌరవాన్ని అందుకున్నాడు. బుమ్రాకు రెండోసారి ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. బుమ్రా డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో అతను 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగు, ఐదో టెస్టుల్లో ప్రతీ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు.

Details

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసిన బుమ్రా

బుమ్రా మొత్తం 32 వికెట్లతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చెలరేగిపోయాడు. అయితే సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో వెన్నుముక నొప్పితో అతను బౌలింగ్ చేయలేకపోయాడు. అయినా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన మూడు టెస్టుల్లో 17.64 సగటుతో 17 వికెట్లు తీశాడు. మరోవైపు, ప్యాటర్సన్ శ్రీలంక, పాకిస్తాన్‌తో ఆడిన టెస్టుల్లో 16.92 సగటుతో 13 వికెట్లు తీశాడు.