
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 27 ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ 88.17 మీటర్ల త్రోతో నీరజ్ చోప్రా మరో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసి విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు.ఆ తరువాత వరుసగా 86.32,84.64,87.73,83.98, మీటర్ల దూరానికి విసిరాడు.
పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్‌ల నుంచి నీరజ్ కు గట్టి పోటీ ఎదురైంది. అయితే చోప్రా ఆధిపత్యం ముందు వారు తేలిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక గెలుపు
.@Neeraj_chopra1 brings home a historic gold for India in the javelin throw 👏#WorldAthleticsChamps pic.twitter.com/YfRbwBBh7Z
— World Athletics (@WorldAthletics) August 27, 2023