
Neeraj Chopra: జావెలిస్ ఫైనల్ పోరును దయాదుల పోరులా చూశారు : నీరజ్ చోప్రా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. ఈటెను 88.17. మీటర్ల దూరం విసిరి పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచి చరిత్రను సృష్టించాడు.
అయితే ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ రజతం దక్కించుకోగా, చెక్ కు చెందిన వద్లెచ్ కాంస్యతో సరిపెట్టుకున్నాడు.
స్వర్ణం సాధించడం పట్ల నీరజ్ మాట్లాడారు. పాకిస్థాన్ అథ్లెట్ కూడా అద్భుత ప్రదర్శన ఇవ్వడంతో, స్వదేశంలో ఈ పోరును భారత్ వర్సెస్ పాక్ లాగా చూశారని పేర్కొన్నారు.
Details
ఆసియా క్రీడల్లో తలపడనున్న నీరజ్, అర్షద్
తాను పోటీ జరిగే ముందు ఎక్కువగా మొబైల్ ఫోన్ వినియోగించను అని, అయితే ఈ రోజు ఫోన్ ఓపెన్ చేయగానే అందులో మొదటగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ కనిపించిందని నీరజ్ చోప్రా వెల్లడించారు.
ఇక్కడ యూరోపియన్ అథ్లెట్లు కూడా ఏ పెద్ద త్రోను చేసే సామర్థ్యం ఉందని, అయితే చివరి త్రో వరకూ ఇతర త్రోయర్ల గురించి ఆలోచిస్తూనే ఉండాలని చెప్పుకొచ్చాడు.
ఇక అర్షద్ రెండో స్థానంలో నిలవడంపై నీరజ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక త్వరలోనే ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో కూడా నీరజ్, అర్షద్ తలపడనున్నారు.