Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం
జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. జనవరి 31న బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా కూడా ఉన్న షా రెండోసారి ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జై షా మొట్టమొదటి సారిగా జనవరి 2021లో పగ్గాలు చేపట్టాడు. జనవరి 2021లో,బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ స్థానంలో అతి పిన్న వయస్కుడైన షా ACC అధ్యక్షుడయ్యాడు. హసన్ (2016-2018) కంటే ముందు పాకిస్థాన్‌కు చెందిన ఎహసాన్ మణి ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా,ఎన్ శ్రీనివాసన్ (2012-2014) తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు షా.
ACC సభ్యులందరూ ఏకగ్రీవంగా నామినేషన్
వరుసగా మూడోసారి ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జై షాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ACC ప్రెసిడెన్సీ పూర్తిగా ICC సభ్యుల మధ్య తిరుగుతూ ఉండటం గమనార్హం. షమ్మీ సిల్వా జై షాను ఈ పదవి కోసం ప్రతిపాదించారు.పత్రికా ప్రకటనలో పేర్కొన్నట్లుగా ACC సభ్యులందరూ ఏకగ్రీవంగా నామినేషన్‌కు మద్దతు ఇచ్చారు. ఏసీసీ అధ్యక్షుడిగా ఎక్కువసార్లు ఆ పదవీని చేపట్టిన ఏకైక అడ్మినిస్ట్రేటర్ షా. ఆసియాలో క్రికెట్‌ను ప్రోత్సహించి, అభివృద్ధి చేయడంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను గణనీయమైన పురోగతి వైపు నడిపించడంలో జే షా కీలక పాత్ర పోషించాడని SLC చీఫ్ సిల్వా చెప్పారు.
2023 ఆసియా కప్ లో హైబ్రిడ్ మోడల్
భారత్,బంగ్లాదేశ్,పాకిస్తాన్,శ్రీలంక,ఓమన్, నేపాల్ వంటి దేశాల్లోనూ క్రికెట్ అభివృద్దికి జై షా కృషి చేశారని ఏసీసీ బోర్డు సభ్యులు కొనియాడారు. షా హయాంలో, ACC 2022 (T20 ఫార్మాట్), 2023 (ODI ఫార్మాట్)లో రెండు ఆసియా కప్ ఎడిషన్‌లను విజయవంతంగా నిర్వహించింది. 2023 ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇక్కడ పాకిస్తాన్ ,శ్రీలంక సంయుక్తంగా ఆరు జట్ల ఈవెంట్‌ను నిర్వహించాయి.