Page Loader
Team India Coach: టీమ్ ఇండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన! 
టీమ్ ఇండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన!

Team India Coach: టీమ్ ఇండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 10, 2024
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కొత్త కోచ్ కోసం అన్వేషణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనుందని ముంబైలో జై షా వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కోచ్. కానీ, జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఆ తర్వాత భారత జట్టుకు కొత్త కోచ్ అవసరం. కొత్త కోచ్‌కి సంబంధించి బోర్డు త్వరలో ప్రకటన విడుదల చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్‌తో ముగియనుందని జే షా అన్నారు. అయితే భవిష్యత్తులో భారత జట్టుకు కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు.

Details 

టీమ్‌ఇండియాకు కొత్త ప్రధాన కోచ్‌ 

బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ వంటి కోచింగ్ స్టాఫ్‌లోని ఇతర సభ్యులపై ప్రధాన కోచ్ ఎంపిక తర్వాత అతని సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. ఈ చర్చల సమయంలో,షా విదేశీ కోచ్ అవకాశాలను కూడా తోసిపుచ్చలేదు. కొత్త కోచ్ భారతీయుడా లేక విదేశీయుడా అనేది ప్రస్తుతానికి చెప్పలేనని జై షా అన్నాడు. దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.అయితే,ఇంగ్లండ్,పాకిస్థాన్ లా ప్రతి ఫార్మాట్‌కు ప్రత్యేక కోచ్ ఉండే అవకాశం ఉందా లేదా అన్న విషయం తెలియరాలేదు. జట్టులో చాలా మంది ఆల్-ఫార్మాట్ ఆటగాళ్లు ఉండడమే దీనికి కారణం.జే షా ప్రకారం,ప్రతి ఫార్మాట్‌కు వేర్వేరు కోచ్‌లు ఉండటం వల్ల ఈ ఆటగాళ్లను సర్దుబాటు చేయడం కష్టమవుతుంది.

Details 

పదవీకాలం కనీసం 3 సంవత్సరాలు 

టీం ఇండియా కొత్త కోచ్‌ని దీర్ఘకాలికంగా ఎంపిక చేస్తామని బీసీసీఐ సెక్రటరీ స్పష్టం చేశారు. అతని ప్రారంభ పదవీకాలం కనీసం 3 సంవత్సరాలు ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ తొలి పదవీకాలం 2 సంవత్సరాలు. 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ తొలి పదవీకాలం 2023 వన్డే ప్రపంచకప్ వరకు ఉంది. కానీ, దీని తర్వాత అతని పదవీకాలం మళ్లీ T20 ప్రపంచ కప్ 2024 వరకు పొడిగించబడింది.