Jitesh Sharma: పెళ్లి పీటలెక్కిన టీమిండియా యువ క్రికెటర్.. వధువు ఎవరంటే
భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ పెళ్లి పీటలెక్కాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన జితేశ్ శుక్రవారం దాంపత్య జీవితంతంలోకి అడుగుపెట్టాడు. తక్కువ మంది సన్నిహితుల మధ్య సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన షలక ముకేశ్వర్ ను జితేశ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. తమ పెళ్లి వేడుక ఫోటోలను జితేశ్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రేజీ ప్రపంచంలో 8.8.8న మనం ఒకరికొకరం దొరికాం అంటూ ఆ ఫొటోలకు జితేశ్ క్యాప్షన్ ఇచ్చాడు.
జితేశ్ శర్మ కు శుభాకాంక్షల వెల్లువ
భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివం దూబేలతో పాటు పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు జితేశ్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జితేశ్ భార్య షలక ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివింది. ఐపీఎల్‌లో జితేశ్ వికెట్ కీపర్, పవర్ ఫుల్ హిట్టర్‌గా పేరొందాడు. ఈ ఆటగాడు పంజాబ్ కింగ్స్ తరుఫున అద్భుతంగా ఆడాడు. ఇక వన్డే వరల్డ్ కప్ తర్వాత బ్యాకప్ వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు.