
Joanna Child: సెన్సేషన్ క్రియేట్ చేసిన జోవన్నా చైల్డ్.. 64 ఏళ్లకే టీ20 అరంగేట్రం!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. పోర్చుగల్ జట్టులో 64 ఏళ్ల జోవన్నా చైల్డ్ అరంగేట్రం చేస్తూ చరిత్ర సృష్టించారు.
ఏప్రిల్ 7న నార్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆమె అంతర్జాతీయ టీ20లకు ప్రవేశించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఈ అరంగేట్రంతో జోవన్నా చైల్డ్, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక వయసు గల డెబ్యూట్ ప్లేయర్‌గా నిలిచారు.
ఇప్పటి వరకు ఈ రికార్డు ఫాక్లాండ్ ఐలాండ్‌కు చెందిన ఆండ్రూ బ్రౌన్లీ పేరిట ఉండగా, ఆయన 62 ఏళ్లు 145 రోజుల వయసులో క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ రికార్డును జోవన్నా అధిగమించారు.
Details
మొదటి స్థానంలో జిబ్రాల్టర్
అయితే అతి పెద్ద వయస్సులో టీ20 అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో జిబ్రాల్టర్‌కు చెందిన సాలీ బార్టన్ ఉన్నారు. ఆమె 66 సంవత్సరాలు 334 రోజుల్లో ఎస్టోనియాపై తన తొలి టీ20 మ్యాచ్ ఆడారు.
జోవన్నా చైల్డ్ క్రికెట్ జ్ఞానం లేకుండానే ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
నార్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆమె ఆడింది. బ్యాటింగ్‌లో కేవలం 3 పరుగులే చేయగా, బౌలింగ్‌లో వికెట్ లేకుండా 11 పరుగులు ఇచ్చారు. ఆమె ఎకానమీ రేటు 16.50గా నమోదైంది.
అయినా ఆమె ఈ వయసులోనూ క్రికెట్‌ను ఎంచుకుని, పోర్చుగల్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ఆడిన చైల్‌డ్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల నుంచి ప్రశంసల జల్లు పడుతోంది.
Details
టీ20ల్లో అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్సు ఆటగాళ్ల జాబితా
1. సాలీ బార్టన్ - 66 సంవత్సరాలు 334 రోజులు
2. జోవన్నా చైల్డ్ - 64 సంవత్సరాలు
3. ఆండ్రూ బ్రౌన్లీ - 62 సంవత్సరాలు 145 రోజులు
4. కేమాన్ మాలీ మూర్ - 62 సంవత్సరాలు 25 రోజులు