
Jose Butler: జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ఇంగ్లండ్ ఐదోవ ఆటగాడిగా రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ బోణి కొట్టింది.
తొలి వన్డేల్లో ఓడిపోయిన ఇంగ్లండ్, కీలక మైన రెండో వన్డేలో విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించడంతో విండీస్ 202 పరుగులకే కుప్పకూలింది.
లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 32.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి సిరీస్‌ను సమం చేసింది.
ఈ మ్యాచులో జోస్ బట్లర్ (Jose Butler) 45 బంతుల్లో 58 నాటౌట్‌గా నిలిచి ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
వన్డేల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ తరఫున 5వేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.
Details
180 వన్డేల్లో 26 శతకాలు బాదిన బట్లర్
అతని కంటే ముందు ఇయాన్ మోర్గాన్ (6,957), జో రూట్ (6,522), ఇయాన్ బెల్ (5,416), పాల్ కాలింగ్‌వుడ్ (5,092) ఉన్నారు.
బట్లర్ తన 180వ వన్డేలో ఈ ఘనతను సాధించడం విశేషం.
180 వన్డేలు ఆడిన బట్లర్ 39.85 సగటుతో 5,022 సాధించాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 11 సెంచరీలను బాదాడు.
బట్లర్ స్వదేశంలో 42.83 సగటుతో 2,313 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి.