Ranchi : రాంచీ జేఎస్‌సీఏ స్టేడియం వద్ద తొక్కిసలాట.. విచారణకు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌లోని రాంచీ నగరంలోని జేఎస్‌సీఏ (JSCA) స్టేడియం వద్ద మంగళవారం జరిగిన జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ (JPL) ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు అభిమానులు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంచనాలకు మించి ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవడంతో పశ్చిమ గేటు వద్ద రద్దీ తీవ్రస్థాయికి చేరిందని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, మ్యాచ్ ప్రారంభానికి ముందే వేలాదిగా అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. పశ్చిమ గేటు వద్ద భద్రతా తనిఖీలు నెమ్మదిగా సాగడంతో బయట వేచి ఉన్న వారిలో అసహనం పెరిగింది. ఈ క్రమంలో కొందరు ఒక్కసారిగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట ఏర్పడింది.
వివరాలు
భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం..
ఈ ఘటనలో గేటుతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడంతో మ్యాచ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించారు. ఈ ఘటనకు దారితీసిన భద్రతా లోపాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జిల్లా పరిపాలన అధికారిక విచారణను ప్రారంభించింది. అలాగే, ఘటన అనంతరం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
వివరాలు
ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందన..
తొక్కిసలాట ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందించారు. గాయపడిన వారికి తక్షణమే వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. "జార్ఖండ్ ప్రీమియర్ లీగ్ (JPL) ఫైనల్ టీ20 మ్యాచ్ సందర్భంగా కొంతమంది గాయపడినట్లు సమాచారం అందిన వెంటనే ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశాను. సివిల్ సర్జన్‌తో పాటు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశాం. అంబులెన్సులను వెంటనే ఘటనాస్థలానికి పంపించాం. గాయపడిన ప్రతి ఒక్కరికీ అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నాం" అని మంత్రి ఇర్ఫాన్ అన్సారీ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
#WATCH | Jharkhand: A stampede-like situation arose at the JSCA Stadium in Ranchi during the final match of the Jharkhand T20 League due to an unexpectedly large crowd. More details awaited
— ANI (@ANI) June 23, 2026
Jharkhand Health Minister Irfan Ansari says- Hospitals have also been alerted for the… pic.twitter.com/CqlfHjTrC3