Page Loader
Kane Williamson : కేన్ ముందు కఠిన పరీక్ష.. ఫీట్‌గా లేకపోతే అంతే సంగతి!
కేన్ ముందు కఠిన పరీక్ష.. ఫీట్‌గా లేకపోతే అంతే సంగతి!

Kane Williamson : కేన్ ముందు కఠిన పరీక్ష.. ఫీట్‌గా లేకపోతే అంతే సంగతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2023
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ పై గంపెడు ఆశలను పెట్టుకుంది. ఈ ప్లేయర్ ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా ? లేదా ? అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కి ఆ దేశ క్రికెట్ బోర్డు రెండు వారాల సమయాన్ని ఇచ్చింది. అప్పటిలోగా తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాలని సూచించింది. ఐపీఎల్ లో గాయపడ్డ విలియమ్సన్ ఇటీవలే కోలుకొని బ్యాట్ ను పట్టుకున్నాడు. వచ్చే 14 రోజుల్లో ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే న్యూజిలాండ్ జట్టులో కేన్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

Details

కేన్ విలియమ్సన్ కి రెండు వారాల సమయం

ఇప్పటి నుంచి కేన్ విలియమ్సన్ కు రెండు వారాల సమయం ఉందని, అప్పటి వరకు తాము వన్డే వరల్డ్ కప్ జట్టుని ప్రకటించమని, ఆలోపు అతను ఫిట్ నెస్ సాధిస్తాడని భావిస్తున్నామని, అయితే అదంతా తేలికైన పని కాదని కివీస్ హెడ్ కోచ్ తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు 5నెలలకు దూరమైన విలియమ్సన్, ఈ మధ్య కోలుకొని నెట్స్ లో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రాక్టీసు చేస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా ఆక్టోబర్ 5న ప్రారంభ కానుంది. మొదటి మ్యాచ్ కివీస్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది.