
Gautam Gambhir : కపిల్ దేవ్ కిడ్నాప్.. క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ కు గురయ్యారు. ఈ విషయాన్ని నిన్న గౌతమ్ గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ఆ వీడియోలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కపిల్ దేవ్ చేతులను బంధించి, నోటికి గుడ్డ కట్టి బలవంతంగా లాక్కెతున్నట్లు ఉంది.
దీనిపై గంభీర్ ఇది నిజం కాదని ఆశిస్తున్నానని, కపిల్ క్షేమంగా ఉంటారని భావిస్తున్నానని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆ వీడియో వాణిజ్య ప్రకటన అని, ప్రపంచ కప్ ప్రసారాలకు సంబంధించిన ప్రోమో చిత్రీకరణలోని దృశ్యాలని తేలింది.
ఈ విషయంపై మరోసారి గంబీర్ ఎక్స్ లో స్పందించాడు.
Details
డిస్నిప్లస్ హాట్ స్టార్ లో ప్రపంచ కప్ మ్యాచులను ఉచితంగా చూడొచ్చు
అరే కపిల్ జీ బాగా ఆడారని, యాక్టింగ్‌లో కూడా ప్రపంచ కప్ ఉంటే కపిల్ దేవే గెలిచేవారని, ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్ మొబైల్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీ అని ఎప్పటికీ గుర్తుండిపోతుందని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
అయితే ప్రపంచ కప్ మ్యాచులను డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో పూర్తిగా ఉచితంగా చూడొచ్చు. అది కూడా డేటాసేవర్ మోడ్ లో లభిస్తుంది.
ఈ విషయాన్ని డిస్నిప్లస్ హాట్ స్టార్ స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియోను షేర్ చేసిన గంభీర్
Areh @therealkapildev paaji well played! Acting ka World Cup 🏆 bhi aap hi jeetoge! Ab hamesha yaad rahega ki ICC Men's Cricket World Cup is free on @DisneyPlusHS mobile pic.twitter.com/755RVcpCgG
— Gautam Gambhir (@GautamGambhir) September 26, 2023