
IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. సుదర్శన్‌కు గ్రీన్ సిగ్నల్?
ఈ వార్తాకథనం ఏంటి
8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి టీం ఇండియాలోకి అడుగుపెట్టిన కరుణ్ నాయర్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశను మిగిల్చాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి రెండో, మూడో టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఇచ్చినా, అంచనాలను అందుకోలేకపోయాడు. చివరి 6 ఇన్నింగ్స్‌లలో కరుణ్ ఒక్క అర్ధసెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. లార్డ్స్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ క్రీజులో కొంతసేపు నిలబడ్డాక వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో అతని స్థానంపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి.
Details
సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్
ఇప్పుడు కరుణ్ నాయర్‌కు బదులుగా సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే, నాల్గవ టెస్ట్‌లో గంభీర్, కరుణ్‌పై నమ్మకాన్ని కొనసాగిస్తాడా లేక మార్పుకు వెళ్తాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ WV రామన్ స్పందించారు. కరుణ్‌కు చాలామంది అవసరమైనంత అవకాశాలు ఇచ్చారని, కానీ అతను నిరాశపరిచాడని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్‌కు తగినంత అవకాశాలు ఇవ్వకుండా ఒక్క టెస్టులోనే బెంచ్‌కు నెట్టి వేసిన తీరుపై రామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Details
రామన్ వ్యాఖ్యలు
సాయి సుదర్శన్ ఆ మ్యాచ్‌లో ఆడించకపోతే బాగుండేది. లేదా ఒకటీ రెండు అవకాశాలు ఇచ్చి అతని ప్రతిభను పరీక్షించాల్సింది. ఒక్క మ్యాచ్ ఆడి వెంటనే బెంచ్‌కి నెట్టి వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కరుణ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ మూడింటిలో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కరుణ్‌కి మొత్తం 131 పరుగులే వచ్చాయి. సగటు 21.83మాత్రమే. అతడి అత్యధిక స్కోరు 40 మాత్రమే. మరోవైపు సుదర్శన్ ఒక్క మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ డకౌట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేశాడు. అలా అని అతడిని వెంటనే పక్కన పెట్టడం సబబు కాదని రామన్ అన్నారు. నాల్గవ టెస్టు దృష్ట్యా జట్టు యాజమాన్యం సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌లకు అవకాశాలు ఇవ్వాలని రామన్ సూచించారు.