ICC: ఐసీసీ కీలక నిర్ణయం.. 2032-35 క్రికెట్ షెడ్యూల్‌కు ఆమోదం!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2032-35 కాలానికి సంబంధించిన క్రికెట్ షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త సైకిల్‌లో మొత్తం ఆరు ప్రపంచ స్థాయి టోర్నీలు జరగనున్నాయి. 2032 అక్టోబర్-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌తో ఈ సైకిల్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చే వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఇక 2033లో రెండు ప్రధాన టోర్నీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూన్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్, అక్టోబర్‌లో ఎనిమిది జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్నాయి.
వివరాలు
టోర్నీల వేదికలు, ఫార్మాట్‌పై ఇంకా స్పష్టత లేదు
2032 టీ20 ప్రపంచకప్, 2033 డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వేదికలను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు.
అలాగే 2033లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్‌పైనా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ మెగా టోర్నీలకు ఏ దేశాలు ఆతిథ్యమిస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే 2027, 2029, 2031 డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణ హక్కులను ఇప్పటికే ఇంగ్లండ్ దక్కించుకుంది.
వరుసగా మూడు ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని ఇంగ్లండ్ పొందింది.
వివరాలు
డబ్ల్యూటీసీ సైకిల్స్‌పై కీలక నిర్ణయాలు
ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న ఐసీసీ సమావేశంలో 2027-29, 2029-31 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల కూర్పును కూడా ఖరారు చేయనున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
దీంతో పాటు ఫ్రాంచైజీ లీగ్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ వ్యవస్థను కాపాడేందుకు ఫ్రాంచైజీ లీగ్ రివ్యూ గ్రూప్ చేసిన సిఫార్సులను బోర్డు పరిశీలించనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మరింత మెరుగుపరచడంపై చర్చించనున్నారు.