Page Loader
Champions Trophy: టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌?
టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌?

Champions Trophy: టీమిండియా గేమ్‌ప్లాన్‌ సిద్ధం.. పిచ్‌ కండిషన్స్‌పై ఎఫెక్ట్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడంతో జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపు సులభమే అనిపిస్తున్నా, చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సూత్రాన్ని మాత్రం మర్చిపోవద్దని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, వాళ్ల రోజైన బంగ్లాదేశ్ ఏ టీమ్‌నైనా ఓడించగలదు. ఈ అవకాశాన్ని వారికి ఇవ్వకుండా, టీమిండియా శ్రమించి సునాయాస విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Details

టీమిండియా బలహీనతలివే

టీమిండియా సూపర్ ఫేవరేట్‌గా ఉన్నా జట్టులో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా రోహిత్-విరాట్ జోడీ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే మెరిపించారా? లేక నిజంగా ఫుల్ ఫామ్‌లోకి వచ్చారా? అనే విషయం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తేలనుంది. అలాగే బుమ్రా లేకపోవడంతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. దానికి తోడు సెలెక్టర్లు సిరాజ్‌ను పక్కన పెట్టారు. షమీ ఉన్నా తగినంత రిథమ్‌లో కనిపించడం లేదు. యంగ్ బౌలర్లైన అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వన్డేల్లో పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల, వీరి ప్రదర్శన ఎలా ఉంటుందనేదానిపై సందేహాలు ఉన్నాయి.

Details

 మిడిలార్డర్ లోపాలు 

శ్రేయస్ అయ్యర్ స్థిరమైన ఆటతీరు కనబరుస్తున్నా, కేఎల్ రాహుల్ నుంచి మరింత మద్దతు అవసరం. రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడితే మిడిలార్డర్ బలంగా మారుతుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉండాలని ఆశిద్దాం. పిచ్ రిపోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెండు కొత్త పిచ్‌లను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కి, అలాగే బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. టీమిండియా జట్టును బట్టి చూస్తే, సరైన కాంబినేషన్‌తో బరిలో దిగితే దుబాయ్ పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

Details

భారత తుది జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్