ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 36వ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట రైడర్స్ తలపడనున్నాయి. ఇరుజట్లు ఐపీఎల్ లో 31 సార్లు తలపడ్డాయి ఇందులో ఆర్సీబీ 14, కేకేఆర్ 17 విజయాలను సాధించింది. ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని సునీల్ నరైన్ 4 నాలుగుసార్లు ఔట్ చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో కోహ్లీ 25.50 సగటుతో 102 పరుగులు చేశాడు. నేడు జరిగే మ్యాచ్ లో కోహ్లీ, అతని బౌలింగ్ లో ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే 400 పైగా పరుగులు చేశాడు.
అండ్రీ రస్సెల్ ఫామ్ లోకి వచ్చేనా?
ఉమేష్ యాదవ్ ఇన్నింగ్స్ లో డుప్లెసిస్ ఆరుసార్లు తలపడగా.. ఒకసారి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో డుప్లెసిస్ ని ఔట్ చేయడానికి ఉమేష్ యాదవ్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా లెగ్ స్పిన్నర్ల బౌలింగ్ లో 18సార్లు ఔట్ అయ్యాడు. ఆర్సీబీ ప్లేయర్ హసరంగ బౌలింగ్ లో నితీష్ రాణా పరుగులు సాధిస్తే కేకేఆర్ తిరుగుండదు. ఆండ్రీ రస్సెల్ ఈ సీజన్ లో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేదు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో రస్సెల్ 134.61 స్ట్రైక్ రేట్‌తో 35 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ చేతిలో ఇప్పటివరకూ రెండుసార్లు పెవిలియానికి చేరాడు. ఈ మ్యాచ్ లోనైనా అండ్రీ రస్సెల్ విజృంభించాలని కేకేఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు.