కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం!
ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది. డుప్లిసెస్ కు గాయం కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో గత రెండు మ్యాచ్ లోనూ ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. అయితే గత ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ తలపడింది. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను అధిగమించేందకు కోహ్లీకి, టీమ్ సభ్యులకు భారీ జరిమానా విధించారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.24 లక్షలు, జట్టు సభ్యులకు రూ.6 లక్షలు కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు.
గతంలో ఆర్సీబీ కెప్టెన్ కు జరిమానా
ఈ ఐపీఎల్ లో మరోసారి తప్పు జరిగితే ఆ మ్యాచ్ కు ఎవరు కెప్టెన్ గా ఉంటే వారిపై రెండు మ్యాచ్ ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో కూడా ఆర్సీబీ స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. ఆ మ్యాచ్ లో స్లో ఓవర్ కారణంగా కెప్టెన్ డుప్లెసిస్ కు తొలి తప్పిదం కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించారు. ప్రస్తుతం ఐపీఎల్ లో 24 లక్షలు జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం.