Page Loader
అనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ
బ్యాడ్మింటన్ అడుతున్న విరాట్, అనుష్క

అనుష్క శర్మతో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2023
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

మైదానంలో తన బ్యాట్‌తో బౌండరీల వర్షం కురిపించే కోహ్లీ బ్యాట్ వదిలేసి సడన్‌గా రాకెట్ పట్టాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్ ఆడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాట్ తో సెంచరీలు బాదే కోహ్లీ చేతికి రాకెట్ వచ్చింది.ఈ స్టార్ క్రికెటర్ తన బ్యాడ్మింటన్ ఆటతో ఫ్యాన్స్ ను అశ్చర్యపరిచాడు. తన భార్య అనుష్కశర్మతో కలిసి కోహ్లీ బెంగళూరులో బ్యాడ్మింటన్ ఆడారు. ప్యూమా ఇండియా చేపట్టిన 'లెట్ దేర్ బి స్పోర్ట్'లో భాగంగా ఈ ఇద్దరూ జీవితంలో క్రీడల విశిష్టతను చాటి చెబుతూ ఇలా బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడల వల్ల చదువు దెబ్బతింటుందన్న అపోహకు ఈ కార్యక్రమం ద్వారా చెక్ పెట్టాలని ప్యూమా భావిస్తోంది.

Details

మిక్స్‌డ్ డబుల్స్ జోడిగా మారిపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బెంగళూరులోని రెసిడెన్సియల్ సొసైటీకి వెళ్లి బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ జోడిగా మారిపోయారు. ఒకరు యాక్టర్, మరొకరు క్రికెటర్ అయినా కూడా ఈ ఇద్దరూ తమలోని బ్యాడ్మింటన్ నైపుణ్యాలను బయటకు తీశారు. క్రీడలు, ఫిట్‌నెస్ ను మన సంస్కృతిలో భాగం చేయాలన్నదే తమ లక్ష్యమని ప్యూమా ఇండియా ఎండీ అభిషేక్ గంగూలీ చెప్పారు. ప్రతి ఒక్కరీ జీవితంలో క్రీడలు ఓ భాగం కావాలని, దీని కోసం ప్యూమా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.