Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టులో ఖలిస్థానీ మద్దతుదారుల కలకలం
మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఖలిస్థానీ అనుకూలవాదులు ఆందోళన చేపడటం కలకలం రేపింది. టికెట్ లేని వారు మ్యాచ్ మైదానంలో ప్రవేశించి, ఖలిస్థానీ జెండాలు ప్రదర్శిస్తూ టీమిండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్యను చూసిన భారత అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే విక్టోరియా పోలీసులు అప్రమత్తమై, ఖలిస్థానీ మద్దతుదారులను మైదానం నుంచి బయటకు పంపించారు. ఈ ఘటనపై స్పందించిన భారత అభిమానులు ఈ ఆందోళనకు విలువ లేదని పేర్కొన్నారు. పంజాబ్‌తో సంబంధం లేని వ్యక్తులు ఇక్కడొక గందరగోళం సృష్టించేందుకు వచ్చారని తెలిపారు.
భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డ పన్నూ
మరొకవైపు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌పై బెదిరింపులు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే మహాకుంభమేళాకు దాడి చేసే అవకాశముందని ఒక వీడియో విడుదల చేశాడు. ఈ విషయంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్ స్పందిస్తూ మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇలాంటి కుయుక్తులు చేశారని పేర్కొంది.