Kieron Pollard: ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా పోలార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కొత్త హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆటగాడు కీరన్ పోలార్డ్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ముంబయి ఇండియన్స్‌తో పోలార్డ్‌కు 16 ఏళ్ల అనుబంధం ఉందని, ఇప్పుడు అతడు మరో కొత్త బాధ్యతను చేపట్టనున్నాడని పేర్కొంది. ఆటగాడిగా జట్టుతో సుదీర్ఘ ప్రయాణం సాగించిన పోలార్డ్.. బ్యాటింగ్ కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు.
వివరాలు
గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఇప్పటివరకు కొనసాగిన మహేల జయవర్దనే ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
దీంతో ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో పోలార్డ్ నియామకంపై ఫ్రాంచైజీ ప్రకటన చేసింది.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్.. గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
ఈ క్రమంలో జయవర్దనే కోచ్ పదవి నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. మరోవైపు, జట్టు కెప్టెన్సీ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
రోహిత్ శర్మకు మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిణామాల మధ్య పోలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ముంబయి ఇండియన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు: కీరన్ పోలార్డ్
తన నియామకంపై కీరన్ పోలార్డ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ముంబయి ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.
ఎంఐ తన జీవితంలో, క్రికెట్ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు.
ఈ జట్టు, ఆటగాళ్లు, అభిమానులతో కూడిన 'పల్టాన్'తో తనకున్న అనుబంధం ఎంతో విలువైనదని చెప్పాడు.
ఆటగాడిగా ప్రారంభమైన తన ప్రయాణం.. కోచ్‌గా కూడా కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నాడు.
తనపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీతో పాటు ముంబయి ఇండియన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్
Mumbai Indians elevate Kieron Pollard as Head Coach
— Mumbai Indians (@mipaltan) October 24, 2026
A defining figure in MI’s success, the remarkable 16-year association of Kieron Pollard within the #OneFamily enters a new chapter.
Read more - https://t.co/ORZz4gruIr pic.twitter.com/BMI38BYH1f