LOADING...
Virat Kohli :వన్డేల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డు బద్దలు
వన్డేల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డు బద్దలు

Virat Kohli :వన్డేల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ శతకాల రికార్డు బద్దలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా రన్ మెసిన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఇవాళ తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో కింగ్ కోహ్లీ 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డేలలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును (49)ను అధిగమించి, కోహ్లీ(50) సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లో కలిపి విరాట్ కోహ్లీ 80 సెంచరీలు చేశాడు.

Details

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ

సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 279 ఇన్నింగ్స్ లలో 50 సెంచరీల ఫీట్ ను సాధించాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితా.. విరాట్ కోహ్లీ (భార‌త్‌) - 50 శ‌త‌కాలు సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) - 49 శ‌త‌కాలు రోహిత్ శర్మ(భార‌త్‌) - 31శ‌త‌కాలు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 30 సనత్ జయసూర్య (శ్రీలంక‌)- 28 శ‌త‌కాలు