క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే.. కోహ్లీ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడాకారుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
కింగ్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ క్రికెట్లోనే కాదు ఆదాయంలోనూ కింగే అని నిరూపించుకున్నాడు.
అతని ఆస్తుల విలువను స్టాక్‌గ్రో అనే సంస్థ ప్రకటించింది. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం మొత్తం అతని ఆస్తుల విలువ రూ.1,050 కోట్లు అని తేలింది.
కోహ్లీకి బీసీసీఐ A+ కాంట్రాక్టు ఇవ్వడంతో అతనికి సంవత్సరానికి రూ. 7 కోట్లు అందనున్నాయి. మ్యాచుల ఫీజుల రూపంలో ఒక టెస్టు మ్యాచుకు రూ.15లక్షలు, వన్డే మ్యాచుకు రూ. 6లక్షలు, టీ20 మ్యాచుకు రూ. 3లక్షలు అందుతాయి.
Details
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకు రూ. 8.9 కోట్లు
ఐపీఎల్‌లోనూ కోహ్లీ భారీగా సంపాదిస్తున్నాడు. అతనికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచేజీ ఏడాదికి రూ.15 కోట్లు చెల్లిస్తోంది.
ఇవే కాకుండా కోహ్లీకి సొంతంగా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో వంటి ఏడు స్టార్టప్‌లలో కోహ్లీ పెట్టుబడులు కూడా పెట్టాడు.
అలాగే 18 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కూడా ఉన్నాడు. ఒక్కో ప్రకటనకు ఏడాదికి రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటాడు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ పెట్టడానికి రూ. 8.9 కోట్లు, ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేయడానికి రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు.