
ఫిఫా వరల్డ్ కఫ్ ఫైనల్ లో ముద్దు వివాదం.. రాజీనామా చేసిన రూబియల్స్
ఈ వార్తాకథనం ఏంటి
స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ను మద్దు పెట్టుకొని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్ విమర్శల పాలైన విషయం తెలిసిందే.
తాజాగా అతను కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఫిఫా తనపై వేసిన సస్పెన్షన్ వేటుతో ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక తిరిగి పదవిలో కొనసాగే అవకాశం లేదని లూయిస్ రూబియల్స్ పేర్కొన్నారు.
గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలు సంచలనంగా మారాయి.
Details
ఫుట్ బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా
ఆగస్టు నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లండ్ ను స్పెయిన్ ఫిఫా మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను తొలిసారి అందుకుంది.
స్పెయిన్ స్టార్ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్నోసో, ఇతర క్రీడాకారిణుల చెంపలపై రూబియల్స్ ముద్దాడాడు. దీన్ని జెన్నిఫర్ హెర్నోసో కూడా వ్యతిరేకించింది.
అప్పట్లో రూబియల్స్ మూడు నెలల పాటు ఫుట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా నిషేధించింది.
ఈ వివాదాల కారణంగా ఫుట్ బాల్ ఛీప్ పదవితో పాటు, యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్స్ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.