Loading...
Will Young: టీమిండియాపై చెలరేగిన కివీస్ బ్యాటర్.. విల్ యంగ్ ఖాతాలో మరో శతకం!
టీమిండియాపై చెలరేగిన కివీస్ బ్యాటర్.. విల్ యంగ్ ఖాతాలో మరో శతకం!

Will Young: టీమిండియాపై చెలరేగిన కివీస్ బ్యాటర్.. విల్ యంగ్ ఖాతాలో మరో శతకం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ వన్డే క్రికెట్‌లో మరోసారి సత్తా చాటాడు. భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో సెంచరీతో మెరిశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో విల్ యంగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కివీస్‌కు శుభారంభం అందించాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ ఆధిపత్యం ప్రదర్శించడంలో అతడి ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది.

వివరాలు

వన్డేల్లో ఐదో సెంచరీ

2021లో వన్డేల్లో అరంగేట్రం చేసిన విల్ యంగ్.. తాజాగా తన ఖాతాలో ఐదో సెంచరీని వేసుకున్నాడు.

ఇప్పటివరకు 67 వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు ఐదు శతకాలతో పాటు 12 అర్ధ సెంచరీలు సాధించాడు.

నిలకడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.

వివరాలు

2,150 పరుగుల మైలురాయి

క్రిక్‌ఇన్ఫో గణాంకాల ప్రకారం.. విల్ యంగ్ వన్డేల్లో ఇప్పటికే 2,150కు పైగా పరుగులు సాధించాడు.

35కిపైగా సగటుతో బ్యాటింగ్ చేస్తున్న అతడి స్ట్రైక్‌రేట్ 84కు పైనే ఉంది భారత్‌పై తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఇది అతడికి రెండో 50కి పైగా స్కోరు.

ఈ క్రమంలో టీమిండియాపై 300కు పైగా పరుగులు సాధించాడు. కీలకమైన నాలుగో వన్డేలో సెంచరీతో మెరిసిన విల్ యంగ్.. న్యూజిలాండ్‌కు భారీ స్కోరు అందించే దిశగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ADVERTISEMENT