India vs New Zealand: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్, మూడో టెస్టులోనూ భారత్‌ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై భారత్‌పై క్లీన్‌స్వీప్ చేయాలన్న ఉత్సాహంతో ఉన్న కివీస్, ముంబై వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయంతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తన విన్నింగ్ జట్టులో ఎలాంటి మార్పు చేయకుండానే బరిలోకి దిగారు. భారత జట్టులో మాత్రం కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ పేసర్ బుమ్రా ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వడంతో, అతని స్థానంలో హైదరాబాదీ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.
ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేస్తాం : రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయామని, కానీ ఈ మ్యాచ్‌ను గెలవడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. ఈ పిచ్ తమకు అనుకూలంగా ఉందని, ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడమే లక్ష్యమని అన్నారు. తుది జట్లు భారత్ రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లి, పంత్, సర్ఫరాజ్, జడేజా, సుందర్, అశ్విన్, ఆకాశ్ దీప్, సిరాజ్ న్యూజిలాండ్ లాథమ్, కాన్వే, యంగ్, రవీంద్ర, డారిల్ మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, సోధి, హెన్రీ, పటేల్, విలియయ్