Loading...
NZ vs IND: ఐదో వన్డేలో కివీస్‌ చిత్తు.. టీమిండియాదే సిరీస్
ఐదో వన్డేలో కివీస్‌ చిత్తు.. టీమిండియాదే సిరీస్

NZ vs IND: ఐదో వన్డేలో కివీస్‌ చిత్తు.. టీమిండియాదే సిరీస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. తాజాగా ఐదు వన్డేల సిరీస్‌ను కూడా దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో (NZ vs IND) 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో భారత్‌ గెలవగా.. మూడో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.

వివరాలు

187 పరుగులకే కివీస్‌ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది.

కివీస్‌ బ్యాటర్లలో డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నిక్‌ కెల్లీ (24), మిచెల్‌ శాంట్నర్‌ (24), విల్‌ యంగ్‌ (22), మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (19), క్రిస్టియన్‌ క్లార్క్‌ (16) పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌ రెండేసి వికెట్లు తీశారు. ఆకిబ్‌ నబీ, యశ్‌ ఠాకూర్‌, నమన్‌ ధిర్‌ తలో వికెట్‌ సాధించారు.

వివరాలు

అక్షర్‌, ఇషాన్‌ కీలక ఇన్నింగ్స్‌లు

అంతకుముందు టీమ్‌ఇండియా బ్యాటర్లలో అక్షర్‌ పటేల్‌ (46; 55 బంతుల్లో), ఇషాన్‌ కిషన్‌ (46; 58 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

రోహిత్‌ శర్మ (7), విరాట్‌ కోహ్లీ (5) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌ 22, రుతురాజ్‌ గైక్వాడ్‌ 18 పరుగులు చేశారు.

చివర్లో మహ్మద్‌ సిరాజ్‌ (14 నాటౌట్‌; 20 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌ (14; 4 బంతుల్లో రెండు సిక్స్‌లు) విలువైన పరుగులు జోడించారు.

దీంతో భారత్‌ 209 పరుగుల స్కోరు సాధించగలిగింది. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది.

ADVERTISEMENT