NZ vs IND: కివీస్ చరిత్రాత్మక విజయం.. 423 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం
న్యూజిలాండ్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మూడో టెస్టులో 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బజ్‌బాల్ క్రికెట్‌తో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కివీస్ షాక్ ఇచ్చింది. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా ఇది 11వ అతిపెద్ద విజయం. మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకున్నా, చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌తో తన టెస్టు కెరీర్‌కు టిమ్ సౌథీ వీడ్కోలు చెప్పారు. చివరి మ్యాచ్‌లో సౌథీ రెండు కీలక వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్‌ను 143 పరుగులకే ఆలౌటైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి న్యూజిలాండ్
దీంతో 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 453 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ముందు 658 పరుగుల సాధ్యం కాని లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంగ్లండ్ 234 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలే (5), బెన్ డకెట్ (4) తక్కువ పరుగులకే పెవిలియానికి చేరారు. ఈ విజయం ద్వారా న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 44.23 శాతం పర్సంటేజీతో ఉన్న కివీస్ 48.21 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా (63.33 శాతం), ఆస్ట్రేలియా (60.71 శాతం), భారత్ (57.29 శాతం) టాప్-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐదో స్థానంలో శ్రీలంక ఉంది.