IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌లకు KKR కెప్టెన్ దూరం..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 సీజన్ (IPL 2024) ప్రారంభం అవ్వడానికి ఇంకా మరికొద్ది రోజులే ఉంది.
ఈ సమయంలో ఫ్రాంచైజీలకు గాయాలు,వ్యక్తిగత కారణాలతో ఆటగాళ్లు దూరం కావడం పెద్ద తలనొప్పిగా మారింది.
తాజాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్ లకు అందుబాటులో లేకోపోవచ్చునని వార్తలు వినవస్తున్నాయి.
అయితే దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రేయస్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు.
విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చి 95 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Details
నితీశ్ రాణాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా?
ఈ ఇన్నింగ్స్‌లో అతను ముషీర్ ఖాన్‌తో కలిసి భారీ భాగస్వామ్యం కూడా చేశాడు.
కానీ, దీని తర్వాత ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు విదర్భ జట్టు వచ్చినా.. శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌కి రాలేదు.
అయితే, మళ్లీ వెన్ను నొప్పి తిరగబెట్టిందని.. రంజీ ఫైనల్ ముగిసిన తర్వాత కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది ఇదే సమస్యతో శస్త్రచికిత్స చేయించుకుని వన్డే వరల్డ్ కప్ నాటికి వచ్చాడు.
పాత గాయం తిరగబెట్టడం వల్ల శ్రేయస్ IPL 2024లో పాల్గొనడం అనుమానంగా ఉంది.
దింతో ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోతే కోల్‌కతా యాజమాన్యం మళ్లీ నితీశ్ రాణాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందా? కొత్తగా ఎవరినైనా కెప్టెన్ చేస్తుందో చూడాలి.