Page Loader
RR vs KKR: కేకేఆర్ ఘన విజయం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!
కేకేఆర్ ఘన విజయం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

RR vs KKR: కేకేఆర్ ఘన విజయం.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) ఎట్టకేలకు తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించిన కేకేఆర్.. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (97 నాటౌట్ - 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు) కేకేఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Details

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్

ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (33 - 28 బంతుల్లో 5 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (29 - 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా తలా రెండు వికెట్లు తీశారు.

Details

 డికాక్ విధ్వంసం - కేకేఆర్ గెలుపు 

లక్ష్యచేధనలో కేకేఆర్ 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. క్వింటన్ డికాక్ 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ 22 (17 బంతుల్లో 2 ఫోర్లు) తో రాణించాడు. మోయిన్ అలీ (5) రనౌట్ కాగా, రహానేను హసరంగా ఔట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వానిందు హసరంగానే ఏకైక వికెట్ తీయగలిగాడు.

Details

మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 

కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మోయిన్ అలీ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్‌ను కట్టడి చేశారు. వీరిద్దరూ కలిసి 8 ఓవర్లలో కేవలం 40 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌ను బాగా ఉపయోగించుకున్న వారు వరుసగా వికెట్లు తీసి రాజస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టారు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, వానిందు హసరంగా, నితీష్ రాణాలను ఔట్ చేసి మ్యాచ్‌ను కేకేఆర్ వైపు మళ్లించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గెలిపించిన స్పిన్నర్లు