Page Loader
GT vs KKR: గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్ 
గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్

GT vs KKR: గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 39వ మ్యాచ్‌కి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్ తో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తలపడనుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిన కోల్‌కతా ఈ మ్యాచులో గెలవాలని కసితో ఉంది. మరోవైపు ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా, కేవలం ఒక్క మ్యాచులో మాత్రమే గెలుపొందింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. గత ప్రదర్శనల ఆధారంగా చూస్తే.. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ గెలుపు కోసం కష్టపడాల్సిన వస్తోంది

Details

టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌మే బెస్ట్!

ఈడెన్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. RCBతో జరిగిన మ్యాచ్‌లో KKR మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగులు చేయగా, ఆ స్కోర్‌ను RCB సులభంగా ఛేదించింది. SRHతో మ్యాచ్‌లో KKR మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేసింది, అనంతరం ప్రత్యర్థిని 120 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్నోతో మ్యాచ్‌లో ప్రత్యర్థి 238 పరుగులు చేయగా, కేకేఆర్ 234 పరుగుల దగ్గర ఆగిపోయి నాలుగు పరుగుల తేడాతో ఓడింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది.

Details

ఈడెన్ పిచ్ ఎలా ఉంటుంది? 

ఈడెన్ గార్డెన్స్ పిచ్ మ్యాచ్‌ ఆరంభంలో 2-3 ఓవర్ల వరకూ పేసర్లకు సహకరిస్తుంది. అయితే బంతి పాతబడిన తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో పవర్‌ప్లే ఓవర్లలో గుజరాత్ జట్టు 60-65 పరుగులు చేయగలదు. ఒకవేళ గుజరాత్ మొదట బ్యాటింగ్ చేస్తే.. టార్గెట్ 200-210 మధ్యే ఉండే అవకాశం ఉంది.

Details

కేకేఆర్, గుజరాత్ హెడ్ టు హెడ్ రికార్డు 

ఇప్పటివరకు కేకేఆర్, గుజరాత్ నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, గుజరాత్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఎవరికి ఆధిక్యం..? ప్రస్తుతం గుజరాత్ జట్టు కన్పిస్తున్న ఫామ్‌, జోష్ చూస్తే.. ఈ మ్యాచ్‌లో గెలుపు వారి వైపే ఉన్నట్లు తెలుస్తోంది. టేబుల్ టాపర్‌గా నిలుస్తూ, మ్యాచ్‌లలో నిలకడగా రాణిస్తున్న గుజరాత్.. కేకేఆర్‌పై ఆధిక్యంలో ఉండే అవకాశముంది.