యశ్ దియాల్ ఛాంపియన్ అంటూ కేకేఆర్ ట్విట్
అఖరి ఓవర్లో 31 పరుగులిచ్చి గుజరాత్ ఓటమికి యశ్ దియాల్ కారణమయ్యాడు. దీంతో మైదానంలో అతడు ముఖాన్ని దాచుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతన్ని ఉద్ధేశించి కేకేఆర్ ట్వీట్ చేసి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. ఒక్కొసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుందని, ఈ రోజు తనది కాదని, యశ్ దియాల్ ఎప్పుడు ఛాంపియనే, మిగతా మ్యాచ్‌లో పుంజుకొని మరింత రాణిస్తావ్ అంటూ కేకేఆర్ ట్విట్ చేసింది. దీంతో కేకేఆర్ అతడికి అండగా నిలిచి నెటిజన్లు మనసు గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌లో యశ్ దియాల్ బౌలింగ్‌లో రీకూసింగ్ ఐదు సిక్సర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన రీకూసింగ్
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలో తడబడింది. వెంకటేష్ అయ్యర్(83), నితీష్ రాణా(45) పరుగులతో ఫర్వాలేదనిపించారు. చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. రికూసింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన యశ్ దియాల్, దేశవాలీ క్రికెట్లో రింకూతో కలిసి ఆడాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌కు ఎంపికైన యశ్ దయాల్.. గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.