
KL Rahul: సంజీవ్ గోయెంకాతో మాట్లాడేందుకు నిరాకరించిన కేఎల్?.. నెట్టింట వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
గత సీజన్ వరకు లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారిపోయిన విషయం తెలిసిందే.
గత సీజన్‌లో ఓ మ్యాచ్ సమయంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రాహుల్‌తో చిన్న ఘర్షణ దృశ్యాలు అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కీలకంగా రాణించాడు.
మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో చేతులు కలిపే సందర్భంలో సంజీవ్ గోయెంకా, ఆయన కుమారుడు శశ్వాంత్ గోయెంకా మైదానంలో ఉన్నారు.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ వాళ్లిద్దరితో షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. అయితే సంజీవ్ గోయెంకా కేఎల్‌ను ఆపి మాట్లాడాలని ప్రయత్నించినా, రాహుల్ మాత్రం మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు.
Details
గతంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్
శశ్వాంత్ గోయెంకాతోనూ అదే రీతిలో వ్యవహరించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ మళ్లీ ఊపందుకుంది.
గతేడాది సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రాహుల్‌పై వ్యక్తపరిచిన అసహనం, ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి అభిమానులకు గుర్తొచ్చాయి.
గెలిచే ఆత్మవిశ్వాసం ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే ఆటగాళ్లను రిటైన్ చేయాలని చూస్తామని గతంలో సంజీవ్ గోయెంకా పేర్కొన్న వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అయ్యాయి.
దీనికి స్పందించిన కేఎల్ రాహుల్, మెగా వేలానికి ముందు తన మనసులో మాట బయటపెట్టాడు.
వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఇకపై నా ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెడతా. నన్ను పూర్తిగా స్వేచ్ఛతో ఆడనిస్తేనే అక్కడ ఆడతా. ఐపీఎల్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశాడు.