Page Loader
విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు
ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 09, 2023
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ఆఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఈ మేరకు సరికొత్త చరిత్ర లిఖించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక వేగవంతమైన సెంచరీని సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే మార్ష్‌ కప్‌ 2023లో భాగంగా టస్మానియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రేజర్‌ (దక్షిణ ఆస్ట్రేలియా) బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు. 21 ఏళ్ల యువ చిచ్చరపిడుగు కేవలం 29 బంతుల్లోనే సెంచరీని బాదాడు. ఇన్నింగ్స్‌లో 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్‌ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.

DETAILS

కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు పిండుకున్న సౌత్ అస్ట్రేలియా

దీంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసక బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ 31 బంతుల్లోనే శతకం బాదాడు. గత 10 ఏళ్లుగా కొనసాగిన రికార్డును ఫ్రేజర్ అధిగమించాడు. టస్మానియాతో మ్యాచ్‌లో 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్‌ ఆస్ట్రేలియా కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు పిండుకుంది. 2019లో మెల్‌బోర్న్‌లో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఫ్రేజర్ మెక్‌గర్క్‌కి ఇదే తొలి దేశీయ సెంచరీ కావ‌డం గ‌మ‌నార్హం. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో విజయవంతమైన ఛేజింగ్ రికార్డు దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది.