అంబటి రాయుడి టాలెంట్‌ను కోహ్లీ, రవిశాస్త్రి గుర్తించలేదు: కుంబ్లే షాకింగ్స్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు క్రికెటర్, టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మూడు రోజుల క్రితం ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా నేడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని రాయుడు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన అతను ఛాంపియన్ గా కెరీర్ ను ముగించాడు. 2019లో రాయుడు వరల్డ్ కప్ ఆడకపోవడంపై టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అంబటి రాయుడి టాలెంట్ ను గుర్తించకుండా కోహ్లీ, రవిశాస్త్రి అన్యాయం చేశారంటూ కుంబ్లే పేర్కొన్నారు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడటానికి రాయుడిని ముందుగానే సిద్ధం చేసినా.. తీరా వరల్డ్ కప్ సమయానికి అతన్ని పక్కన పెట్టారు.
Details
టీమిండియా తరుపున 55 వన్డేలు ఆడిన రాయుడు
2019 వరల్డ్ కప్ లో కచ్చితంగా ఆడతాడని అనుకున్నా చివరి నిమిషంలో రాయుడిని కాదని, విజయశంకర్ కు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అవకాశం ఇచ్చారని కుంబ్లే తెలిపారు.
రాయుడు 2019 వరల్డ్ కప్ కచ్చితంగా ఆడాల్సి ఉండేదని, అతన్ని వరల్డ్ కప్ నుంచి తప్పించడంతో తనకు చాలా ఆశ్చర్యం వేసిందని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో కుంబ్లే మాట్లాడాడు.
వరల్డ్ ఎంపిక చేయడంపై అప్పట్లో రాయుడు రిటైర్మెంట్ ను ప్రకటించాడు. టీమిండియా తరుపున అంబటి రాయుడు 55 వన్డేలు, ఆరు టీ20లను ఆడాడు