ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. మళ్లీ టాప్-5లోకి విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి ప్రవేశించాడు.
ఒక స్థానం మెరుగుపరుచుకున్న కోహ్లీ ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాడు. శుభమన్ గిల్, బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ 9వ స్థానాన్ని కాపాడుకోగా, కేఎల్ రాహుల్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
రషీద్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు.
మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడిపోగా, మహ్మద్ షమి ఒక స్థానం మెరుగుపరచుకుని 14వ ర్యాంకును సాధించాడు.
వివరాలు
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా, రవీంద్ర జడేజా 9వ స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రాస్‌వెల్ విశేష ప్రగతిని కనబర్చుతూ 26 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకును దక్కించుకున్నాడు.