
IND vs PAK: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. పాక్‌పై టీమిండియా ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(100*) శతకం బాది భారత జట్టును విజయతీరాలకు చేర్చారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 241 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి గెలుపొందింది.
భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (20) వికెట్ కోల్పోయింది. తర్వాత శుభ్‌మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (56) మంచి ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Details
చాంఫియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన పాక్ జట్టు
పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలా ఓ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ ఓటమితో పాక్ జట్లు దాదాపుగా ఛాంపియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. కేవలం 287 ఇన్నింగ్స్‌లో (299మ్యాచులు) కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.